హనుమకొండ (మే – 08) : వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) పేరుతో JLM, AE ఉద్యోగాల పేర్లతో ఫేక్ నోటిఫికేషన్ సర్క్యులేట్ చేశారు.
అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) (నోటిఫికేషన్ నం.02/2023 – 68, జూనియర్ లైనామ్యాన్ 3898(నోటిఫికేషన్ నం. 01/2023)… మొత్తం 3,966 పోస్టులకు మే 5న ఉద్యోగ ప్రకటనలను వ్యాప్తి చేశారు.
నకిలీ ఉద్యోగ ప్రకటనలను చూసి నిరుద్యోగులు మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోపాల్ రావు ఓ ప్రకటనను విడుదల చేశారు.