ఫేక్ సర్టిఫికెట్లు అనే అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నాము – గాదె వెంకన్న, కుమార్

  • చెక్ లిస్ట్ లో మాన్యువల్ గా జరిగిన తప్పులే విష ప్రచారానికి మూలం.
  • ఈ తప్పులు సరిదిద్దడానికి కమీషనరేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది.
  • ఫైనల్ లిస్ట్ విడుదల చేయకముందే ఫేక్ అంటూ ప్రచారం అసంబద్ధం.

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఇంటర్ కమిషనరేట్ పరిధిలో కాంట్రాక్టు అధ్యాపకుల అర్హుల జాబితాను పబ్లిక్ డొమైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అనేక తప్పులు దొర్లిన ఫలితంగా తప్పుల తడకగా ఉన్నటువంటి జాబితాలను సవరణ చేయకుండానే కావాలని కాంట్రాక్టు అధ్యాపకుల సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు అనే అసత్య ప్రచారాన్ని చేస్తున్న వ్యక్తుల యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికిని వాటిని గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలో పేర్కొనడంలో జరిగినటువంటి మాన్యువల్ తప్పులను సరిదిద్దిక ముందే ఈ జాబితాలను మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి కావాలని కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో బురద చల్లాలని చూస్తున్నటువంటి వారి తీరు బాధాకరమని అన్నారు. ఈ విషయంలో జరిగినటువంటి అధికారుల తప్పులను ప్రభుత్వం దృష్టికి త్వరలోనే తీసుకెళ్తామని , క్రమబద్దీకరణ అర్హుల జాబితా అధికారులు సిద్ధం చేసినప్పటికిని ఇంకా ప్రభుత్వానికి అందజేయడంలో గల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, పరశురాం, బాబు, తిరుపతి, గుండు ఆంజనేయులు, హరిబాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us @