సర్టిఫికెట్ ల పై విష ప్రచారం తగదు – TGDCLA

కాంట్రాక్ట్ లెక్చరర్ ల సర్టిఫికెట్ ల పై ఒక పత్రికలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన అసత్యకరమైనటువంటి వార్తలను TGDCLA రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు యమ్ వినోద్ కుమార్ తెలిపారు. ఎవో దుష్టశక్తులు కావాలని మీడియా ద్వారా తప్పుడు సమాచారంతో రాయించారని… అవి ఎవరూ నమ్మవద్దని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చాలా మంది రెగ్యులర్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. కచ్చితంగా యూజీసీ గుర్తింపు పొందిన వారిని కూడా నకిలీ అని పేర్కొనడం జరిగిందని పేర్కొన్నారు.

మీడియకు తప్పుడు వార్తలను ప్రచార చేయవద్దని తెలియచేయడం జరిగిందని. అలాగే ప్రాథమిక సభ్యులు కూడా ఆందోళన చెందవద్దని రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ ఖాదరవల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, డా. మహేష్ కుమార్, బాలరాజు, వెంకటేశం తదితరులు తెలియజేశారు.

Follow Us @