భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 8వ తేదీన నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
భారత్ బంద్ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 9న జరిగే పరీక్షలన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే జేఎన్టీయూ పరిధిలో రేపు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు.
8న జరగాల్సిన పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసినట్లు కన్వీనర్ కిషన్ వెల్లడించారు. వాయిదా పడ్డ ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు డిసెంబర్ 8న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Follow Us@