హైదరాబాద్ (ఫిబ్రవరి – 16) : పీహెచ్డీ ప్రవేశాలకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు ఫిబ్రవరి 15న ఆదేశాలు జారీ చేసింది.
పీహెచ్ ప్రవేశాలకు రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ చింతలకు చెందిన ఎన్. ఉమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పీహెచ్డీ తో సహా ఇతర కోర్సుల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశాలు జారీచేస్తూ పిటిషన్ పై విచారణను మూసివేశారు.