విజయవాడ (ఫిబ్రవరి – 25) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS)కు వయోపరిమితి ఐదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.