BIKKI NEWS (JULY 16) : EURO CUP 2024 WON BY SPAIN. యూరో ఫుట్ బాల్ కప్ 2024 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 2-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
EURO CUP 2024 WON BY SPAIN
దీంతో యూరో కప్ నాలుగోసారి గెలుచుకున్న జట్టుగా స్పెయిన్ రికార్డు సృష్టించింది. జర్మనీ జట్టు మూడు సార్లు ఈ టైటిల్ నెగ్గింది.
స్పెయిన్ తరపున నీకో విలియమ్స్ 47 వ నిమిషంలో, మికల్ ఒయర్ జబాల్ 86వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు తరఫున పాల్మేర్73వ నిమిషంలో గోల్ చేశాడు.
ఇంగ్లండ్ జట్టు రెండుసార్లు ఫైనల్ కు చేరిన రెండుసార్లు రన్నర్ గానే మిగిలింది. 2021లో ఇటలీ చేతిలో ప్రస్తుతం స్పెయిన్ చేతిలో ఓడిపోయింది.
యూరో టోర్నీ చరిత్రలో ఆడిన ఏడు మ్యాచుల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది.
ఓకే యూరో కప్ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. 1984లో ఫ్రాన్స్ చేసిన 14 గోల్స్ రికార్డును ఈసారి 15 గోల్స్ చేసి స్పెయిన్ రికార్డు తిరగరాసింది.
యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ : లమీన్ యమాల్ (స్పెయిన్)
ప్లేయర్ ఆఫ్ద టోర్నీ : రోడ్రి (స్పెయిన్)
విజేత ప్రైజ్ మనీ : 72.89 కోట్లు
రన్నర్ ప్రైజ్ మనీ : 45.56 కోట్లు