యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ టోర్నీ 2020లో ఇటలీ ఇంగ్లాండ్ ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3 – 2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది.
ఆట ప్రారంభమైన 2వ నిమిషానికే ఇంగ్లాండ్ ఆటగాడు లూక్ షా గోల్చేశాడు. 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేసి స్కోరును సమం చేశాడు. మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దాసి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఇక పెనాల్టీ షూటౌట్‌కు మారింది.
ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లాండ్ రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు కొడుదామన్న ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి
ఇక పెనాల్టీ షూటౌట్లో గోల్‌కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీని విజయతీరాలకు చేర్చాడు. అలాగే ప్లేయర్ ఆప్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్ను మరోసారి గెలుచుకుంది.
యూరో కప్ అవార్డులు
- గోల్డెన్ బూట్ అవార్డు – రోనాల్డో (పోర్చుగల్)
- సిల్వర్ బూట్ అవార్డు – ప్యాట్రిక్ షిక్ (చెక్ రిపబ్లిక్)
- బ్రాంజ్ బూట్ అవార్డు – కరిమ్ బెంజేమా(ప్రాన్స్)
- మ్యాన్ ఆఫ్ ద సిరీస్ (గోల్డెన్ బాల్)అవార్డు – డోనరూమా (ఇటలీ)