ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఈ బోర్డు పరీక్షలు తప్పనిసరిగా వ్రాయాలి

హైదరాబాద్ (ఫిబ్రవరి – 25) : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంటర్ బోర్డు నిర్వహించే రెండు పరీక్షలను తప్పకుండా రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలకు గైర్హాజరు అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ మెమో లో ఫెయిల్ అని వస్తుంది.

కావున విద్యార్థులు తప్పకుండా ఈ రెండు పరీక్షలను హాజరుకావాల్సి ఉంటుంది. అవి ఏవి అంటే..

  • ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ (నైతికత & మానవ విలువలు)
  • ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (పర్యావరణ విద్య)

ఈ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 4, 6 తేదీ లలో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు విద్యార్థులు తమ కళాశాలలో రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలు 100 మార్కులకు ఉంటాయి. అందులో 40 మార్కులు ప్రాజెక్ట్ వర్క్, 60 మార్కులు వ్రాత పరీక్ష ఉంటుంది.