పాలమూరు మట్టి పరిమళం : మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ జన్మదినం – అస్నాల శ్రీనివాస్


వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్..తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

తెలంగాణ లోకమంతా తెలిసిన పేరు. పోరాటాలకు నమూనా. విప్లవాలకు పరామర్శ గ్రంథం, అనితరసాధ్యమైన వ్యక్తిత్వం. ఎంతటి భిన్నత్వమో అంతటి ఏకత్వం. తెలంగాణ దుర్భిక్ష చిరునామా పాలమూరు, కానీ ఆ ప్రజల గుండెలు అంతటి సుభిక్షం. తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామక్రిష్ణారావు ఉద్భవించిన మాగాణం.. అలాంటి మహిమాన్విత మేదిని నుండి మార్చ్ 16,1969 అడ్డకల్ మండలం, రాచాల గ్రామంలో విరసనోళ్ళ నారాయణ గౌడ్, సత్తెమ్మ దంపతులకు జన్మించారు. చరిత్రలో కాలం సమాజ అవసరాలకు అనుగుణంగా తన కడుపులో దాచుకొని కన్న బిడ్డ శ్రీనివాస్ గౌడ్.

మహిమాన్విత మేదిని నుండి మార్చ్ 16,1969 అడ్డకల్ మండలం, రాచాల గ్రామంలో విరసనోళ్ళ నారాయణ గౌడ్, సత్తెమ్మ దంపతులకు జన్మించారు. చరిత్రలో కాలం సమాజ అవసరాలకు అనుగుణంగా తన కడుపులో దాచుకొని కన్న బిడ్డ శ్రీనివాస్ గౌడ్. – అస్నాల శ్రీనివాస్

విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకత్వం వహించిన 1969లో ప్రజ్వరిల్లిన తెలంగాణ ఉద్యమంలో వీరి తండ్రి నారాయణ గౌడ్ పాలమూరు జిల్లాలో ముందువరుస యోధుడుగా పోరాడి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అణచివేతకు,చిత్రహింసలకు లోనయ్యాడు. జయపజయాలతో సంబంధం లేకుండా కొనసాగిన పోరాటాలు, త్యాగాలు మరో మహా ఉద్యమానికి భూమికగా నిలుస్తాయి. ఈ వెలుగులో ఆ పోరాట దివిటి ని కొనసాగించడానికి అన్నట్లుగా చరిత్ర మాత కని పెంచిన ఉద్యమయోధుడు విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ .

యుద్ధం అనేది అభివృద్ధికి దారితీసే చర్య, సాహసం పట్ల అభీష్టం లేకపోతే సమాజం నిలిచిపోతుంది.ఆవేశాలు చచ్చిపోయిన జాతి కంటే ఉన్న జాతికి ప్రగతిశీలకరమైన భవిష్యత్ ఉంటుంది. ఈ చారిత్రక సత్యాలను తండ్రి నారాయణ గౌడ్ సాగించిన కుల వివక్ష వ్యతిరేక సామాజిక సంస్కరణ బోధనలు, ఆచరణ నుండి పునికిపుచ్చుకున్న శ్రీనివాస్ గౌడ్ విద్యార్థిగా, ఉద్యోగిగా, ఉద్యోగ ఉద్యమ నేతగా, పాలకుడిగా కూడా అదే స్పూర్తిని ప్రతిఫలిస్తున్న అద్భుత దృశ్యం మన కళ్ళ ముందు ఉంది.

సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య లభిస్తుంది అనే అంబేద్కర్ తాత్వికత, జ్ఞానం లేకపోతే పురోగతి ఉండదు, పురోగతి లేకపోతే సంపద ఉండదు అనే పూలే దర్శన వెలుగులో ప్రకృతి శాస్త్రాలలో పట్ల భద్ర విద్యను, సామాజిక శాస్త్రాలలో కీలకమైన జర్నలిజంలో రెండు డిగ్రీలను అభ్యసిసంచారు. సమాజాన్ని పైకి ఎదగనివ్వని పాత ధోరణులు, అలవాట్లు, ఆలోచనల పథాన్ని మార్చుతూ తార్కికంగా, హేతుబద్ధత, వైజ్ఞానిక దృక్పథాన్ని ఒక జీవన విధానంగా అలవర్చుకొని విద్యను అభ్యసిస్తూ సమాజాన్ని చదువుతూ 1998లో ఉద్యోగ జీవితంలో శ్రీనివాస్ గౌడ్ చేరారు.

తెలంగాణ విముక్తి కోసం అధికారులను ఉద్యమ బాట పట్టించడానికి 2009లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం స్థాపించారు – అస్నాల శ్రీనివాస్

సమాజంలో ఒక మనిషి ఉద్యోగిగా, అధికారిగా సామాజిక శాస్త్రవేత్తగా రూపుదిద్దుకోవడానికి ఆ సమాజంలోని కార్మిక కర్షక కష్టజీవులు చెల్లిస్తున్న మూల్యం పట్ల అవగాహన ఉన్న శ్రీనివాస్ గౌడ్ నగర కార్పొరేషన్ పరిపాలన అధికారిగా ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ కొనసాగారు. ఇదే క్రమంలో ఉద్యోగుల సామాజిక భాధ్యతను పెంచడానికి, దశాబ్దాల నుండి వలసపాలకుల విధానాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ విముక్తి కోసం అధికారులను ఉద్యమ బాట పట్టించడానికి 2009లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం స్థాపించారు.. 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో మహోగ్రదంగా కొనసాగుతున్న స్వరాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడాలని, 1969 ఉద్యమంలో తండ్రి నారాయణ గౌడ్ పోరాటం, అనుభవించిన కష్టాలను, ఆశయాలు జ్ఞాపకం చేసుకొని తెలంగాణ ఉద్యమ ఉధృతికి ఉప్పనై విరుచుకపడ్డారు.

ఫ్రీ జోన్ పై సుప్రీం కోర్ట్ తీర్పుకు నిరసనగా జరిగున పోరులో, సిద్దిపేటలో జరిగిన తెలంగాణ గర్జనలో పెన్ డౌన్ లో దేవీప్రసాద్, స్వామిగౌడ్ లతో అగ్రభాగాన నిలిచాడు. – అస్నాల శ్రీనివాస్

ఫ్రీ జోన్ పై సుప్రీం కోర్ట్ తీర్పుకు నిరసనగా జరిగున పోరులో, సిద్దిపేటలో జరిగిన తెలంగాణ గర్జనలో పెన్ డౌన్ లో దేవీప్రసాద్, స్వామిగౌడ్ లతో అగ్రభాగాన నిలిచాడు. చిదంబరం తన ప్రకటనను ఉపసంహరించుకున్న సందర్భంలో వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని కొనసాగించడం కోసం ఆశయ సాధనకి మరింత ఐక్యతకోసం ఏర్పడిన కోదండరామ్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జాక్ కు కో చైర్మన్ గా నియమితుడై సకల జనుల సమ్మె, సాగరహారం, సంసాద్ యాత్ర లో ఉత్తుంగ తరంగంలా నడిచాడు. ఉద్యమ క్రమంలో బహుజన సామాజిక సంస్కర్తలు పూలే, సాహు మహారాజ్, ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య ల పోరాటాలను ఆశయాల స్పూర్తి సభలను విస్తృతంగా నిర్వహించారు.

అరవై ఏండ్ల ప్రజా ఆకాంక్షల పోరాటాన్ని గెలుపుతీరంకు చేర్చడంలో కెసిఆర్ నాయకత్వంలో కొనసాగిన పోరులో క్రమశిక్షణ, అలుపెరగని మేధో శ్రమ, కార్యాచరణలో కొనసాగిన శ్రీనివాస్ గౌడ్ కు 2014 లో తాను పుట్టి పెరిగిన పాలమూరు నియోజక వర్గం శాసనసభ్యుడిగా పట్టం కట్టింది. 2019లో అత్యధిక మెజారిటీతో మరొక సారి గెలిచారు

ఉద్యమ క్రమంలో బహుజన సామాజిక సంస్కర్తలు పూలే, సాహు మహారాజ్, ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య ల పోరాటాలను ఆశయాల స్పూర్తి సభలను విస్తృతంగా నిర్వహించారు. – అస్నాల శ్రీనివాస్

భూమి పుత్రుడిగా, శాసన సభ్యుడిగా, మంత్రిగా తాను పెరిగిన జీవించిన పాలమూరు ప్రాంత జీవితం, ప్రజల బాధలు, అవసరాలు పంచుకోవడంలో తీర్చిడంలో నిజమైన నైతికత ఆనందం అని ఆ వెలుగులో పాలమూరు ను పచ్చదనంతో, పర్యాటకంతో విన్నూత్నమైన ప్రగతి వైపు నడిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా జీవనాన్ని మెరుగు పర్చే అనేక కార్యక్రమాలను కేసీఆర్, కేటీఆర్ సహకారంతో, దార్శనికతతో చేపట్టాడు. కరువు క్షామంల చిరునామా పాలమూరు ను ఆకుపచ్చని చందమమగా మార్చాడు.నాటి వలసల జిల్లా, పల్లెర్లు మొలిసిన జిల్లా ను నేడు జల రాశులు, పాడిపంటలతో కళ కళ లాడుతూ, సాగునీటి లభ్యతను 2 లక్షల ఎకరాల నుండి 10 లక్షలకు పెంచడంలో, కల్వకుర్తి ,పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిల్ల నెట్టంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పాలమూరు పట్టణంలో ప్రతిరోజు త్రాగునీరు అందే విధంగా కృషి చేసారు. అలాగే హరిత పట్టణంగా తీర్చిదిద్దారు. మహబూబ్ నగర పట్టణాభివృద్ధి సంస్థ ను సాధించి మరో గొప్ప ముందడుగు వేశారు.

కరువు క్షామంల చిరునామా పాలమూరు ను ఆకుపచ్చని చందమమగా మార్చాడు.నాటి వలసల జిల్లా, పల్లెర్లు మొలిసిన జిల్లా ను నేడు జల రాశులు, పాడిపంటలతో కళ కళ లాడేలా చేశాడు. – అస్నాల శ్రీనివాస్

కార్యదీక్ష, సంకల్ప బలం, విధేయతలతో కేసీఆర్ హృదయాన్ని గెలుచుకుని పర్యాటక, సాంస్కృతిక రంగాల హబ్ గా తెలంగాణ ను శ్రమిస్తున్నారు. కృష్ణ, తుంగభద్ర తలాపున ఉన్న పాలమూరులో ఎకో, టెంపుల్, రివర్ టూరిజం ల హబ్ గా మార్చారు. ఇదే నమూనా ను తెలంగాణ అంతటా విస్తరిస్తున్నారు. తన సామాజిక వర్గ అస్తిత్వ స్పృహ ను మది నిండా పరచుకొని వారి వృత్తి ఉపాధులను పెంచే విధంగా కృషి చేస్తున్నారు. బహుళజాతి సంస్థలు అమ్మే పానీయాలు ఎంత చేటు చేస్తాయో ప్రజల భాషలో ఆకట్టుకునేలా వివరిస్తూ, కల్లు పోషకాలను ఎత్తి చూపుతూ నీరా వినియోగం పై, నీరా పానీయం ఉత్పత్తి పై, చెట్ల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. మన అస్తిత్వ ఆత్మ గౌరవ బత్కమ్మ, జానపద కళలను పోషిస్తూ అంతర్జాతీయంగా విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నారు. కరోనా తో మరణించిన వారికి ఎవరూ చేయలేని సాహసంతో వారికి గౌరవప్రద అంత్యక్రియలు జరిపించి మానవత శిఖరంపై నిలిచాడు.

కరోనా తో మరణించిన వారికి ఎవరూ చేయలేని సాహసంతో వారికి గౌరవప్రద అంత్యక్రియలు జరిపించి మానవత శిఖరంపై నిలిచాడు. – అస్నాల శ్రీనివాస్

అహంభావం వెనక్కు తోస్తుంది, విధేయత, వినమ్రత మరింత ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది. గర్వాన్ని తన నిఘంటువులో లేకుండా ప్రజలకు శిష్యుడిగాను,అదే సమయంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉంటున్నారు. నేల అంటి పెట్టుకున్న మనిషిగా ప్రజలలో ఒకడిగా ఐక్యమయ్యి, ఉద్యోగులకు స్నేహితుడిగా శ్రీనన్న గా హృదయ పీఠంపై నిలుచున్నాడు. నిరంతర శ్రమ, పని పట్ల నిబద్ధతలే ఆయుధాలుగా పని చేస్తున్న గౌరవ ప్రోహాబిషన్,ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనన్న మరిన్ని శ్రేయో శిఖరాలను అందుకోవాలని హృదయపూర్వక శుభాకాంక్షలు.


అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560

Follow Us @