పోటీ పరీక్షలలో చరిత్ర సబ్జెక్టు కీలకమైనది : ప్రిన్సిపాల్ ఎర్రోజు శ్రీలక్ష్మి

రాజన్న సిరిసిల్ల జిల్లా (జూలై – 27) : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోజున చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ హెచ్.ఇ.సి. కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును ప్రిన్సిపాల్ ఎర్రోజు శ్రీలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ఎర్రోజు శ్రీలక్ష్మి మాట్లాడుతూ చరిత్ర సబ్జెక్టు కేవలం హెచ్.ఇ.సి. చదివే విద్యార్థులకే పరిమితం చేయకుండా ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సుల చదివే విద్యార్థులకు బోధస్తే దేశ చరిత్రతో పాటు తెలంగాణ చరిత్ర సంస్కృతి పట్ల సరైన అవగాహన పెంపొందుతుందన్నారు. అలాగే ఇంటర్ విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన విద్యార్థులలో మానవీయ, నైతిక విలువలు పెంపొందడంతో పాటు పోటీ పరీక్షల కోసం తర్ఫిదు పొందుతారని పేర్కొన్నారు. ఇంటర్ విద్య వ్యవస్థలో పనిచేస్తున్న చరిత్ర జూనియర్ లెక్చరర్లు సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టు చరిత్ర పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భగత్ ప్రసాద్, కట్టయ్య, భూమోష్, తిరుమలేష్, అశోక్, ఝాన్సీ లక్ష్మి, సుధాకర్, వేణు తదితరులు
పాల్గొన్నారు.

Follow Us @