న్యూడిల్లీ (మార్చి – 24) : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశవ్యాప్తంగా ఉన్న తమ రీజినల్ ఆఫీస్ లలో 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) (గ్రూప్ సి) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపాదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను జారీ చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
◆ పోస్టుల సంఖ్య : 2,674 (AP – 39, తెలంగాణ – 116)
◆ అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్ లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
◆ వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ జీత భత్యాలు : నెలకు రూ.29,200 – రూ.92,300.
◆ ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ రాత పరీక్ష విధానం : ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు కేటాయించారు. జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
◆ దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)
◆ దరఖాస్తు గడువు : మార్చి 27 – 2023 నుంచి ఎప్రిల్ 26 – 2023 వరకు.
◆ దరఖాస్తు సవరణ తేదీలు : ఎప్రిల్ 27 నుంచి 28 వరకు.
◆ పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు.
◆ పూర్తి నోటిఫికేషన్ : PDF FILE
◆ వెబ్సైట్ : https://www.epfindia.gov.in/site_en/Recruitments.php