EPFO వడ్డీ రేటు 8.5%

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (EPFO) 2020 – 21 సంవ‌త్స‌రానికిగాను వ‌డ్డీ రేటును ప్ర‌క‌టించింది. ఈ ఏడాదికి కూడా వ‌డ్డీ రేటును 8.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది.

2019-20 ఏడాదికి కూడా ఇదే వ‌డ్డీ రేటు ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన‌ EPFO సెంట్ర‌ల్ బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌కుముందు 2018-19లో 8.65 శాతం ఉన్న వ‌డ్డీ రేటును గ‌తేడాది మార్చిలో ఏడేళ్ల క‌నిష్ఠానికి (8.5 శాతం) త‌గ్గించింది.

ఈ ఏడాది ఈ రేటును మ‌రింత త‌గ్గిస్తార‌ని ఉహగానాల నేపథ్యంలో EPFO బోర్డు మాత్రం ఎలాంటి మార్పులూ చేయ‌కుండా 8.5% కొనసాగించడం పట్ల ఖాతదారులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us@