హైదరాబాద్ (మే – 03) : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులు అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
సుప్రీంకోర్టు గత ఏడాది నవంబరు 4న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఈపీఎఫ్ఎ పింఛనుదారుల నుంచి ఆప్షన్ వాలిడేషన్, జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను స్వీకరించడానికి ఆన్లైన్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన పింఛనుదారులంతా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.