కాంట్రాక్టు ఉద్యోగులకు EPF తప్పనిసరిగా అమలు చేయాలి – కేంద్ర కార్మికశాఖ

హైదరాబాద్ :: ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను తప్పనిసరిగా ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో నియమించుకున్న కార్మికులకు సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలని సూచించింది.

ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు దీనిపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యక్షంగా, ఏజెన్సీల ద్వారా ఒప్పంద పద్ధతిలో తీసుకున్న కార్మికులకు చట్టపరంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కార్మిక శాఖ గతంలోనే సూచించింది. ఈ మేరకు ఈపీఎఫ్ సాప్ట్ వేర్ లోనూ తాజాగా మార్పులు చేసింది.

కానీ కొన్ని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు, ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాలు వర్తించడం లేదని తెలిసింది. చట్టంలోని నిబంధనల స్ఫూర్తిని ప్రభుత్వ సంస్థలు పాటిస్తూ అందిరినీ పీఎఫ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించింది..

Credits : Eenadu

Follow Us @