ఎం.పిల్, పీహెచ్డీ చేస్తున్న అనర్హులకు ఉపకార వేతనాల పై విచారణ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎం.పిల్ పీహెచ్డీ చేస్తున్న అనర్హులైన అభ్యర్థులకు జాతీయ ఉపకార వేతనాలను అందించడం పై కరీంనగర్ కు కే. శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి ఆయా యూనివర్సిటీలకు, కేంద్రప్రభుత్వానికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు, సి బి ఐ లకు విచారణకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిన ఎం.పిల్, పీహెచ్డీ అభ్యర్థులకు మాత్రమే జాతీయ ఉపకార వేతనాలను మంజూరు చేయాలి కానీ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రిజిస్టర్ కాని అభ్యర్థులకు కూడా ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు తెలిసి వివరాలు అడగగా యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాధానం లేదని అందుకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పిటిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us @