ENGvsNED : ఇంగ్లండ్ ఘనవిజయం, నెదర్లాండ్స్ ఔట్

పూణే (నవంబర్ – 08) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు పూణే వేదికగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్ల మద్య జరిగిన ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. దీంతో నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 179 పరుగులకే ఆలౌట్ అయింది. మొయిన్ ఆలీ, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నెదర్లాండ్స్ ముందు 339/9 పరుగుల లక్ష్యం ఉంచింది. బెన్ స్టోక్స్ సెంచరీ (108) తో పాటు మలాన్ 87 పరుగులతో రాణించడంతో భారీ స్కోరును సాధించింది నెదర్లాండ్స్ బౌలర్లలో డీ లీడే – 3, వాన్ బీక్ ,.ఆర్యన్ దత్ తలో రెండు వికెట్లు తీశారు.