బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) : ASHES SERIES 2023 లో బాగంగా ENGLAND vs AUSTRALIA ల మద్య మొదటి టెస్ట్ ప్రారంభమైంది.
టాస్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టులకు వేగాన్ని నేర్పుతున్న (Bazz Cricket) ఇంగ్లీష్ జట్టు యాషెస్ లోనూ అదే తరహలో బ్యాటింగ్ చేసింది. 393/8 వద్ద మొదటి రోజు ఆట పూర్తి కాకముందే డిక్లర్ చేసి ఇంగ్లండ్ జట్టు సంచలనమే చేసింది.
జో రూట్ (118*) అజేయ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 393/8 పరుగులు సాదించింది. జాన్ బెయిర్‌స్టో 78, క్రాలీ 61 పరుగులతో రాణించారు.
ఈ క్రమంలో జో రూట్ 30వ టెస్టు సెంచరీ నమోదు చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ 4, హెజిల్‌ఉడ్ 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 14/0 తో ఉంది.
Ashes series లో బాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్ల మద్య 5 టెస్టు లు జరగనున్నాయి.