ఇంటర్ లో ఎంపీసీ చదవకున్న ఇంజనీరింగ్ కు అర్హులే – AICTE

ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాలంటే ఇంటర్‌లో తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టులు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం చదవాలి అంటే MPC గ్రూప్ చదవాలి. కానీ ఇకనుంచి ఇంటర్‌లో ఈ కోర్సులను చదవకున్నా ఇంజినీరింగ్‌లో చేరొచ్చు. 10+2 స్థాయిలో ఏ కోర్సులు చదివినా ఇంజినీరింగ్‌లో చేరేలా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (AICTE) నిబంధనల్లో మార్పులు చేసింది.

తన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఇంజినీరింగ్‌లో ఏదైనా కోర్సులో చేరాలనుకొనే ఇతర సబ్జెక్టుల విద్యార్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను బ్రిడ్జికోర్సులుగా చదివి ఉంటే సరిపోతుంది.

ఏఐసీటీఈ చైర్‌పర్సన్‌ అనిల్‌ సహస్రబుధే మాట్లాడుతూ ఇంజినీరింగ్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు ప్రధాన సబ్జెక్టులుగా కొనసాగుతాయని చెప్పారు. బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌, టెక్స్‌టైల్స్‌ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులకు ఇంటర్‌లో MPC చదువని వారికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని ఎంచుకోవటంలో రాష్ర్టాలకు, విద్యాసంస్థలకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు.

నూతన విద్యావిధానం ప్రకారం ఇంజినీరింగ్‌లో చేరటానికి ప్లస్‌ 2 స్థాయిలో 14 సబ్జెక్టులు చదివిన విద్యార్థులకు అవకాశం ఇస్తూ AICTR ఆదేశాలిచ్చింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, బయోటెక్నాలజీ, టెక్నికల్‌ ఒకేషనల్‌ సబ్జెక్ట్‌, ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టులో ఏదైనా మూడింటిలో కనీసం 45 శాతం మార్కులు సాధించినవారికి ఇంజనీరింగ్ కోర్స్ లలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది.

Follow Us @