BIKKI NEWS (JUNE 19) : ENGINEERING FEE NO HIKE THIS YEAR. తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2025 ను పాత ఫీజులతోనే చేపట్టాలని కమిటీ నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ENGINEERING FEE NO HIKE THIS YEAR
ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్ తరగతులను ప్రారంభించాలి. అంటే ఆలోపు కౌన్సిలింగ్ పూర్తి చేయాలి. కావున ఫీజుల పెంపు విషయాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కౌన్సిలింగ్ పూర్తైనా తర్వాత ఫీజుల పెంపు విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా ఇప్పటివరకు 155 కళాశాలలకు అనుమతులు లభించాయి.
గత ఏడాది 175 కళాశాలలకు గాను 1,18,989 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా వాటిలో 1,07,160 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్