దేశ వ్యాప్తంగా ఉన్న 17 రాష్ట్రాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో(EMRS) ఖాళీగా ఉన్న 3,479 బోధనా సిబ్బంది భర్తీకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీలకు సంబంధించిన 4 వేర్వేరు పోస్టులలోని బోధనా సిబ్బందిని ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే టీజీటీలకు మినహా మిగతా సిబ్బందికి ఇంటర్వ్యూలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
- ఏపీలో 14 ప్రిన్సిపాల్, 6 వైస్ ప్రిన్సిపాల్, 97 టీజీటీలతో కలపి మొత్తం 117 ఖాళీలు ఉన్నాయని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
- తెలంగాణలో 11 ప్రిన్సి పాల్, 6 వైస్ ప్రిన్సిపాల్, 77 పీజీటీ, 168 టీజీటీలతో కలిపి మొత్తం 262 పోస్టుల భర్తీ జరుగనుంది.
దరఖాస్తులను స్వీకరించడానికి పోర్టల్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య అందుబాటులో ఉండనుంది. ప్రవేశ పరీక్షలను తాత్కాలికంగా జూన్ మొదటి వారంలో షెడ్యూల్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 288 పాఠశాలలున్నాయి. 452 కొత్త పాఠశాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటిసంఖ్య 740కి చేరనుంది. ఇందులో 100 పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనలు దాదాపు ఖరారయ్యాయని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తెలిపింది.
◆ అప్లికేషన్ ప్రారంభం :: 1 ఏప్రిల్ 2021
◆ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 30 ఏప్రిల్ 2021
◆ పరీక్ష తేదీ :: జూన్ 1 వ వారం
◆ మొత్తం పోస్టుల సంఖ్య – 3479 ఖాళీలు
◆ ప్రిన్సిపాల్ :: 175 పోస్టులు
◆ వైస్ ప్రిన్సిపాల్ :: 116 పోస్టులు
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :: 1244 పోస్టులు
◆ శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT):: 1944 పోస్టులు
● వెబ్సైట్ :: https://tribal.nic.in/Home.aspx
● Apply online direct link ::
https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/Page/Page?PageId=5
పూర్తి నోటిఫికేషన్ :: https://drive.google.com/file/d/18XIQ3Bj5XyLxC2lnbHn3sTXQ15gKcpMN/view?usp=drivesdk
