ఉద్యోగ సంఘాల జేఏసీ తో ఎప్రిల్ 12న కేబినెట్ సబ్ కమిటీ భేటీ

BIKKI NEWS (APR. 07) : Empoyees JAC meet Cabinet sub committee on April 12th. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న 57 సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణ తో ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది.

Empoyees JAC meet Cabinet sub committee on April 12th.

సమస్యల పరిష్కారం కోసం నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన గౌరవ ఉపముఖ్యమంత్రి గారు 12.04.2025 శనివారం రోజున 12 గంటలకు ఉద్యోగుల JAC మరియు క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఈ సమావేశంలో చర్చించి ఉద్యోగుల సమస్యలతో పాటు తహసీల్దార్ల, MPDO ల ఎన్నికల తిరుగు బదిలీల విషయాన్ని పరిష్కరించడానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో JAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, కో చైర్మన్ వంగా రవీందర్ రెడ్డి, TNGO జనరల్ సెక్రటరీ ముజీబ్, TGO సెక్రటరీ సత్యనారాయణ, కృష్ణ యాదవ్, జ్ఞానేశ్వర్, రాజ్‌కుమార్, రమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు