ఉద్యోగి జీవితంలో సర్వీస్ విషయాలపై అవగాహన చాలా ముఖ్యం

  • డాక్టర్ అందే సత్యం, మరియు టీజీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ కష్టాల సత్యనారాయణ, వేలాద్రి

BIKKI NEWS (APR. 12) : Employees Service Rules Awareness programme in Khammam. ప్రతి ఉద్యోగి జీవితంలో సర్వీసు రూల్స్ తెలుసుకోవడం, పాటించడం చాలా ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అందే సత్యం తెలిపారు. ఈరోజు ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ – 475 జిల్లా శాఖ తరపున నూతన అధ్యాపకులకు సర్వీసు రూల్స్ పై అవగాహన తరగతుల ప్రారంభోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి తనకు సంబంధించిన సమాచారాన్ని సర్వీసు రిజిస్టర్ లో మంచిగా ఉండేటట్లు చూసుకోవలసిన బాధ్యత ఉంటుందని తెలిపారు.

Employees Service Rules Awareness programme in Khammam

సర్వీస్ రూల్స్ పట్ల అవగాహన లేకపోతే రిటైర్ అయిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుపుతూ… నూతన అధ్యాపకులందరి ఈ విషయాన్ని గమనించి సర్వీస్ రూల్స్ సంబంధించిన విషయాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న ఖమ్మం జిల్లా టీజీవోస్, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ _475 తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం తెలుపుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ అందరు కూడా సర్వీసులు రూల్స్ పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు .

టీజీవోస్ జిల్లా కార్యదర్శి శ్రీ మోదుగు వేలాద్రి మాట్లాడుతూ… సర్వీస్ రిజిస్టర్ సక్రమంగా లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుపుతూ.. ఉద్యోగులు చాలామంది సర్వీస్ రూల్స్ తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉద్యోగ సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో అండగా ఉంటుందని అధ్యాపక, ఉద్యోగులు అందరు కలిసి సమస్యల సాధన కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గ గంగాభవాని, రాష్ట్ర నాయకులు నాగమల్లేశ్వరరావు పాల్గొని అనేక విషయాలు ఉద్యోగ సంబంధిత హక్కుల గురించి విషయాలు తెలియజేశారు.

ఈ అవగాహన తరగతులలో సర్వీస్ రూల్స్ & ఫండమెంటల్ రూల్స్ , లీవ్ రూల్స్, సర్వీస్ రిజిస్టర్ మెయింటెన్స్ మొదలైన వాటిపై TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్, TSUTF రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, శ్రీ మోరంపూడి నరసింహారావు గారు ఈ విషయాలపై అవగాహన తరగతులు బోధించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతికి మౌనం పాటిస్తూ నిలబడి సంతాపం పాటించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో TGJLA_475 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డా. వస్కుల శ్రీనివాస్, డా. కొప్పశెట్టి సురేష్, రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు ఆర్. మల్లారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి షాహినా బేగం, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి మల్లయ్య, కొండా వినోద్ బాబు, ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఐ కృష్ణార్జునరావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూరు మురళీకృష్ణ, కోశాధికారి భాస్కర్,
ఏ తిరుపతిరావు, దొడ్డ పద్మావతి, కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందికొండ వెంకన్న, తుర్తి జాన్, రాష్ట్ర కౌన్సిలర్ కంచర్ల శ్రీకాంత్, చిన్న బోయిన సత్యనారాయణ, పంది సత్యనారాయణ, జోగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు