BIKKI NEWS (JUNE 29) : EMPLOYEES HEALTH SCHEME SOON MINISTER DAMODARA. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ నూతన ఆరోగ్య పథకాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
EMPLOYEES HEALTH SCHEME SOON MINISTER DAMODARA.
ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆరోగ్య పథకానికి సంబంధించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ప్రతి ఉద్యోగికి క్యాష్ లెస్ ఆరోగ్య పథకాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ… ఉద్యోగులకు సరికొత్త ఆరోగ్య పథకాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతో ఏ ఉద్యోగి కూడా బిల్లుల కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని గతంలో జేఏసీకి హామీ ఇచ్చినట్లుగానే నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్