US OPEN 2021 – మహిళల సింగిల్స్ విజేత ఎమ్మా రెడుకాను

యూఎస్‌ ఓపెన్‌ 2021లో మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన ఎమ్మా రెడుకాను (బ్రిటన్‌) తుదిపోరులో 6-4, 6-3తో లైలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించింది.

క్వాలిఫయర్‌గా టోర్నీ ప్రారంభించి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రెడుకాను.. 44 ఏండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన బ్రిటన్‌ క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది.

  • ఓపెన్‌ ఎరా (1968 తర్వాత)లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌ ఎమ్మా రెడుకాను.
  • వర్జీనియా వేడ్‌ (1977లో వింబుల్డన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన బ్రిటన్‌ క్రీడాకారిణిగా ఎమ్మా రెడుకాను రికార్డుల్లోకెక్కింది.
  • షరపోవా (17 ఏండ్ల వయసులో 2004 వింబుల్డన్‌) తర్వాత పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా ఎమ్మా నిలిచింది.