హైదరాబాద్ (మే – 13) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం బాల బాలికల నుండి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ పాఠశాలలో క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులలో శిక్షణ ఇస్తారు.
2022 – 23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పరీక్ష రాసి ఉండాలి. 12 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
మే 11 నుండి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కలదు. దరఖాస్తు ఫీజు 100/-
మే 29 నుండి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
జూన్ 4వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
అకాడమిక్ సబ్జెక్టుల మీద 100 మార్కులకు రాత పరీక్ష మరియు ఫైన్ ఆర్ట్స్ బేసిక్ స్కిల్స్ మీద 100 మార్కులకు పరీక్ష నిర్వహించబడును.