కరోనా కారణంగా విద్యారంగంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో డిసెంబరు 10న ఉదయం 10గంటలకు ప్రత్యేక ఆన్లైన్ చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు.
డిసెంబరు 10న ఉదయం 10గంటలకు ఆన్లైన్ చర్చా వేదిక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన CBSE బోర్డు పరీక్షలతో పాటు JEE MAIN, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణపై కీలకంగా చర్చించనున్నారు.
ఇందుకోసం #EducationMinisterGoesLive హ్యాష్‌ట్యాగ్ ద్వారా ప్రశ్నలను, సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానించారు. వాస్తవానికి డిసెంబర్ 3న ఈ వెబినార్ జరగాల్సి ఉన్నప్పటికీ డిసెంబరు 10కి వాయిదా పడింది.
సలహాలు, సూచనలు అభ్యర్ధులు
పెద్ద ఎత్తున వస్తున్న వేళ డిసెంబరు 10న ఆన్లైన్ చర్చలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చెబుతారో? 2021లో జరగబోయే పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!