BIKKI NEWS (JULY 15) : Education department transfer guidelines. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ను మరియు మార్గదర్శకాలకు జీవో నెంబర్ 80 ప్రకారం విడుదల చేసింది. GUIDELINES COPY PDF
బదిలీల ప్రక్రియ జులై 16న మొదలై జూలై 31 తో ముగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కింద ఇవ్వడం జరిగింది
Education department transfer guidelines
1) జూన్ 30 – 2024 నాటికి 5 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేయాలని, కనీసం రెండు సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు విజ్ఞప్తి మేరకు బదిలీలు చేయాలని పేర్కొన్నారు. స్పౌజ్ కేసులో ఈ నిబంధన వర్తించదు.
2) జూన్ 30 – 2026 నాటికి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు అవకాశం కలిగించారు. వారికి విజ్ఞప్తి మేరకు బదిలీ చేయవచ్చు.
3) సంబంధించిన కార్యాలయంలో పనిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక కేడర్లు 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు అనే నిబంధనను విధించారు.
4) ఒకే స్థానాన్ని ఇద్దరు కంటే ఎక్కువ ఉద్యోగులు కోరుకున్నప్పుడు కింద నిబంధనల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది
¡) స్పౌజ్ కేసు విభాగంలో ఒకరిని మాత్రమే బదిలీ చేయవలసి ఉంటుంది. (20 పాయింట్లు)
ii) జూన్ 30 – 2026 నాటికి పదవీ విరమణ పొందే వారికి మినహాయింపు.
iii) 70 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత. (15 పాయింట్లు)
iv) మెంటల్లి రిటార్డ్ పిల్లలు ఉన్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ కాబడే అవకాశం కల్పించడం (15 పాయింట్లు)
v) బదిలీలలో వితంతువులకు/ ఒంటరి మహిళలకు/ విడాకులు తీసుకున్న మహిళలకు ప్రాధాన్యత (10 పాయింట్లు)
vi) 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులకు పాత స్టేషన్ సీనియారిటీ ని గరిష్టంగా 6 సంవత్సరాల వరకు ఇవ్వాలి.
Vii) ఉద్యోగి లేదా తన మీద డిపెండ్ అయిన పిల్లలు లేదా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి క్రింది వ్యాధులలో బాధపడుతుంటే వారి వైద్య సౌకర్యార్థం బదిలీలలో ప్రాధాన్యత (సెల్ప్ 20 పాయింట్లు, స్పౌజ్/డిపెండెంట్ చిల్డ్రన్ – 10 పాయింట్లు)
A) క్యాన్సర్
B) న్యూరో సర్జరీ
C) కిడ్నీ మార్పిడి
D) కాలేయ మార్పిడి
E) ఓపెన్ హర్ట్ సర్జరీ
F) BONE TB
టీచింగ్ సిబ్బందికి పెర్ఫార్మన్స్ ని బట్టి పాయింట్లు
- 0 – 40% : 0 పాయింట్లు
- 41 – 60 : 2 పాయింట్లు
- 61 – 80 : 4 పాయింట్లు
- 81 – 100 : 6 పాయింట్లు