Home > CURRENT AFFAIRS > ECONOMY CURRENT AFFAIRS DECEMBER 2023

ECONOMY CURRENT AFFAIRS DECEMBER 2023

BIKKI NEWS : ECONOMY CURRENT AFFAIRS of DECEMBER 2023, రాష్ట్రీయ‌, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాల సమాహారంతో డిసెంబర్ – 2023 ఎకానమీ కరెంట్ అఫైర్స్ సమగ్రంగా మీకోసం…

1) 2000 రూపాయల నోట్లు ఉపసంహరణ తర్వాత ఇంకా గడువు ముగిసినప్పటికీ ఇంకా ఎంత నిలవగల రెండువేల రూపాయల నోట్లు వెనక్కి రావలసి ఉందని ఆర్బిఐ ప్రకటించింది.?
జ : 9760 కోట్లు

2) నవంబర్ – 2023 లో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 4,093 కోట్లు (31% వృద్ధి)

3) నవంబర్ – 2023 లో తెలంగాణ జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 4,986 కోట్లు (18% వృద్ధి)

4) నవంబర్ – 2023 లో భారతదేశపు జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 167,929 కోట్లు (15% వృద్ధి)

5) సముద్ర వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం కలిగిన 10 దేశాల లిస్ట్ లో భారత్ ఏ సంస్థకు ఎన్నికయింది.?
జ : అంతర్జాతీయ సముద్ర యాన సంస్థకు (IMO)

6) NSE తీసుకువచ్చిన కొత్త సూచీ ఏమిటి.?
జ : NIFTT 50 NET TOTAL RETURN

7) వ్యవసాయ రంగం ఆధునికీకరణ కొరకు కెన్యా కు ఎన్ని వేల కోట్లు రుణాన్ని భారత్ అందించనుంది.?
జ : 2,084 కోట్లు

8) గత పదేళ్లలో దేశంలో తలసరి అప్పు ఎంత శాతం పెరిగింది.?
జ : 101%

9) గత పదేళ్లలో దేశంలో తలసరి ఆదాయం ఎంత శాతం పెరిగింది.?
జ : 62.59%

10) గత 5 సంవత్సరాలలో బ్యాంకులు ఎన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశాయి.?
జ : 10.57 లక్షల కోట్లు

11) ఇక్రా సంస్థ అంచనాల ప్రకారం 2025 నాటికి పునరుత్ఫాదక ఇంధన సామర్థ్యం భారత్ లో ఎంతకు పెరగనుంది.?
జ : 170 గిగా వాట్లు

12) ఆర్బిఐ ఏ దేశపు బ్యాంకు తో బాండ్ క్లియరింగ్ సెటిల్మెంట్ ఒప్పందం చేసుకుంది.?
జ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్

13) ఆర్బిఐ పేమెంట్స్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ స్కీమును ఎప్పటి వరకు పొడిగించింది.?
జ : 2025

14) ఆరు లక్షల కోట్ల విలువ కలిగిన 8 భారత కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది.?
జ : భారతి ఎయిర్టెల్

15) హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఏ పేరుతో మొబైల్ ట్రేడింగ్ యాప్ ను ఆవిష్కరించింది.?
జ : HDFC SKY

16) ఆర్బిఐ తాజాగా తన ద్రవ్య సమీక్ష సమావేశంలో రెపో రేట్ ను ఎంతగా ఉంచింది.?
జ : 6.5%

17) ప్రపంచంలో 4వ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది.?
జ : లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆప్ ఇండియా

18) బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ 2023 ఏ బ్యాంకు నిలిచింది.?
జ : ఫెడరల్ బ్యాంక్ – ఇండియా

19) అక్టోబర్ 31 – 2023 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్టార్టప్ లను గుర్తించింది.?
జ : 1,14,902

20) 75 సంవత్సరాల వయస్సు పైబడిన వృక్షాలను సంరక్షించడానికి నెలకు 2,750/- కేటాయిస్తూ హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : ప్రాణ్ వాయు దేవతా యోజన

21) BSE SENSEX 70,000 పాయింట్ల మార్కును ఏ రోజు తాకింది.?
జ : 2023 డిసెంబర్ – 11

22) అక్టోబర్ 2023 గాను దేశీ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఎంతగా నమోదయింది.?
జ : 11.7%

23) నవంబర్ – 2023 గాను రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 5.55%

24) డిస్నీ హట్ స్టార్ భారత్లోని ఏ సంస్థలో విలీనం కానుంది.?
జ : జియో సినిమా

25) UPI AUTOMATIC PAYMENTS పరిమితిని ఎంతకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.?
జ : ఒక లక్ష వరకు

26) 2022 – 23 లో భారత జిడిపి సాధించిన అభివృద్ధి రేటు ఎంత.?
జ : 7.3%

27) టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 2023 అక్టోబర్ మాసానికి ఎంతగా నమోదయింది.?
జ : మైనస్ 0.52%

28) భారతదేశ రక్షణ రంగంలో 100% విదేశీ పెట్టుబడులు పెట్టనున్నాను తొలి సంస్థ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : SAAB

29) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం 2023 యొక్క మూడో దశలో గ్రామ్ గోల్డ్ కు ఎంత ధరను ప్రకటించింది.?
జ : ₹6,199/-

30 ) ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య సముదాయం ను సూరత్ లో ఏ పేరుతో ప్రారంభించారు .?
జ : సూరత్ డైమండ్ బోర్స్

31) ఫిన్‌టెక్ స్టార్టప్ లలో భారత్ కు ఎన్నో స్థానంలో నిలిచింది. .?
జ : 4

32) 2022 – 23లో దేశవ్యాప్తంగా జరిగినా యూపీఐ లావాదేవీలు పరిమాణం.?
జ : 8,375 కోట్లు

33) రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సు ను నీతి ఆయోగ్ ఎక్కడ నిర్వహించనుంది.?
జ : న్యూడిల్లీ

34) బెంగళూరు నగరంలో మెట్రో సేవల విస్తరణ కోసం ఏ దేశం 500 మిలియన్ డాలర్లను అందించనుంది.?
జ : జర్మనీ

35) భారతదేశ బ్యాంకులలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ ల విలువ ఎంత.?
జ : 42,270 కోట్లు

36) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత రుణం తీసుకోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది.?
జ : 20 వేల కోట్లు

37) సెప్టెంబర్ త్రైమాసికం 2023 నాటికి భారతదేశపు అప్పుల సంఖ్య ఎంత.?
జ : 205 లక్షల కోట్లు

38) 5 ట్రిలియన్ ల మార్కెట్ విలువను తాకిన బ్యాంక్ ఏది.?
జ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

39) సూరత్ లో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయం ఏ కార్యాలయం యొక్క రికార్డును బ్రేక్ చేసింది.?
జ : పెంటగాన్ (అమెరికా)

40) 2022 – 23 లో జరిగిన యూపీఐ లావాదేవీలు ఎన్ని.?
జ : 139 లక్షల కోట్లు

41) ఒకే నెలలో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిన ఓడరేవు ఏది?
జ : ముంద్రా ఓడరేవు – ముంబై

42) ఇటీవల యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) గా ఏ సంస్థ గుర్తింపు పొందింది.?
జ : InCred

43) 100 మిలియన్ల ప్రయాణికులను ఒకే సంవత్సరంలో గమ్య స్థానాలకు చేరవేసిన ఎయిర్ లైన్స్ గా ఏ ఎయిర్ లైన్స్ రికార్డు సృష్టించింది.?
జ : ఇండిగో

44) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఏ రెండు బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపింది.?
జ : IDFC & IDFC FIRST BANK

45) ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..?
జ : 250 నుండి 300 (11,160 -12,000)

46) BSE చైర్మన్ గా ఎవరి నియామకానికి సెబీ ఆమోదం తెలిపింది.?
జ : ప్రమోద్ అగర్వాల్

47) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీని తీసుకువచ్చింది.?
జ : ఉత్తర ప్రదేశ్

48) స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ రాష్ట్రానికి 100 మిలియన్ డాలర్ల రుణం అందించడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకారం తెలిపింది.?
జ : సిక్కిం

49) భారతదేశ ఏ దేశంతో ఐదు లిథియం బ్లాక్ ల కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోనుంది.?
జ :అర్జెంటీనా

50) భారత దేశపు సుస్థిరాభివృద్ది కోసం 932 కోట్ల రూపాయల రుణాన్ని అందించడానికి ముందుకు వచ్చిన జపాన్ కు చెందిన బ్యాంక్ ఏది.?
జ : JICA – జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ

51) క్రూడ్ ఆయిల్ కొనుగోలును మొట్టమొదటిసారిగా రూపాయలలో భారతదేశం ఏ దేశానికి చెల్లించింది్?
జ : యూఏఈ

52) సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది .?
జ : 8.2%