ECONOMIC SURVEY 2023 – 24

BIKKI NEWS (JULY 23) : ECONOMIC SURVEY 2023 – 24 KEY POINTS. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వే ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.

ECONOMIC SURVEY 2023 – 24 KEY POINTS

  • 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 6.5 శాతం మంది 7 శాతం వరకు ఉండవచ్చు.
  • 2022 – 23 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది
  • ఆటోమొబైల్ రంగంలో 14 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి
  • దేశీయ బొమ్మల పరిశ్రమ ఎగుమతులు పెరిగేందుకు చైనా బొమ్మల దిగుమతులపై కఠిన నిబంధనలు, కస్టమ్స్ సుంకాలను పెంచాలి.
  • 2030కల్లా భారతీయ ఔషధ పరిశ్రమ పరిమాణం 130 బిలియన్ డాలర్లను తాకా లంటే ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి. మరిన్ని నూతన ఆవిష్కరణలు అవసరం.
  • తయారీ, వస్త్ర పరిశ్రమ, పర్యాటకం, రవాణా రంగాల్లో ఉత్పత్తి. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలతో నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించాలి.
  • కృత్రిమ మేధస్సు, రక్షణాత్మక ధోరణులు, సరఫరా ఇబ్బందులతో సేవా, తయారీ రంగాలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో దేశీయ పర్యాటక రంగం ద్వారా వస్తున్న ఉద్యోగావకాశాల్ని ఒడిసి పట్టుకోవాలి.
  • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమ ల్లోకి రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.
  • 2030కల్లా దేశీయ పునరుత్పాదక శక్తి రంగం 500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవా లంటే రూ.30.5 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం.
  • భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో ఏర్పడుతున్న సవాళ్లను అధిగమించాలంటే దేశీయ ఎగుమతిదారులు తమ సేవలను మరిన్ని ఇతర దేశాల్లోకి విస్తరించాలి.
  • పట్టణీకరణతో ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. తద్వారా దేశీయ నిర్మాణ రంగం ఆశాజనకంగా నడుస్తున్నది. అయితే నిలిచిపోతున్న ప్రాజెక్టులు ఆందోళనకరం.
  • పరిశ్రమ రూపురేఖల్ని మార్చడంలో గ్రీన్ స్టీల్స్ కీలకపాత్ర. కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచం అడుగులు వేసేందుకూ ఇది ప్రధానమే.
  • ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో పెరుగుతున్న రిటైల్ మదుపరుల భాగస్వామ్యం ఆందోళనకరం. జూద ప్రవృత్తిని పెంచేందుకు దోహదం చేస్తున్న పరిణామాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది.
  • సోషల్ మీడియా, ఆనారోగ్య ఆహారం వంటి వాటిలో గణనీయంగా పెరుగుతున్న ప్రైవేట్ రంగ పెట్టుబడులు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి.
  • భవిష్యత్తులో ఆదాయ అసమానతల్ని ఎదుర్కోవడంలో పన్ను విధానాలే కీలకం. ఉద్యోగ-ఆదాయాలపై ఏఐ వంటి వాటి ప్రభావం ఎక్కువవుతుంది.
  • దేశ వాణిజ్య లోటు మున్ముందు మరింత తగ్గుతుంది. ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతోపాటు దేశీయంగా తయారీ రంగ బలోపేతానికి అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు కలిసొస్తాయి.
  • డాటా ప్రైవసీ, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు.. దేశంలో ఈ-కామర్స్ కార్యకలా పాల వృద్ధికి ప్రధాన అవరోధాలు.
  • రవాణా ఖర్చులను తగ్గించడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ది ప్రధాన పాత్ర.
  • ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో భారత్ వాటా 14 శాతం. పెరుగు తున్న దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు
  • గత రెండేండ్లుగా అధిక ఆహార ధరలకు వాతావరణ మార్పులు, రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు, పంట నష్టాలే కారణం.
  • బియ్యం, గోధుమలు, ఇతరత్రా పప్పు ధాన్యాలు ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుంచి తప్పిం చడం ఉత్తమం. ఆయిల్ సీడ్స్, పత్తి, బాస్మతీ రైస్, సుగంధద్రవ్యాలు ఆమోదమే.
  • భారతదేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్ల పాత్ర ప్రధానం.
  • ఈ ఏడాది దేశంలోకి మరిన్ని రెమిటెన్స్లు. 124 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం.
  • ఆర్థిక రంగ ముఖచిత్రం బాగున్నది. అయితే ఒడిదొడుకులపై అప్రమత్తత అవసరం

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు