భారత ప్రభుత్వం దేశంలోని నగరాలలో పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల పై 111 నగరాలలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించారు. ఇందులో మిలియన్ కు పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.
● టాప్ టెన్‌లో ఉన్న నగరాల జాబితా…
1) బెంగళూరు
2) పుణె
3) అహ్మదాబాద్
4) చెన్నై
5)సూరత్
6) నవీ ముంబై
7) కోయంబత్తూర్
8) వడోదర
9)ఇండోర్
10) గ్రేటర్ ముంబై
ఇక పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో సిమ్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి.
For full details please visit below site
Follow Us @