BIKKI NEWS (NOV – 10) : : బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపిం చిన ఎర్త్ షాట్ బహుమతిని (EARTH SHOT PRIZES 2023) ఈ ఏడాది అయిదు సంస్థలను ఎంపిక చేశారు. పర్యావరణ ఆస్కార్లుగా (eco oscar awards 2023) వ్యవహరించే ఈ బహుమతులను 10 లక్షల పౌండ్ల నగదుతో సింగపూర్ లో మంగళవారం ప్రదానం చేశారు.
ఈ అవార్డుల అందుకున్న సంస్థలలో భారతదేశానికి చెందిన సైన్స్ పర్ సోసైటీ మరియు భూపుత్ర అనే రెండు సంస్థలు ఉన్నాయి.
SCIENCE FOR SOCIETY TECHNOLOGIES :
భారతదేశంలో ఆహార వృథాను అరికట్టడానికి కృషి చేస్తున్న ఎస్ఎస్ (సైన్స్ ఫర్ సొసైటీ) టెక్నాలజీ సంస్థకు ఈ అవార్డు ను ప్రధానం చేశారు.
BOOMITRA
ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పాటు పడుతున్న భూమిత్ర సంస్థకూ ఎర్త్ షాట్ బహుమతి లభించింది.
ఈ రెండు భారతీయ సంస్థలతోపాటు ACCION ANDINA (దక్షిణాఫ్రికా),బ్యాటరీ పునర్వినియోగ ప్రాజెక్టు GSRT (హాంకాంగ్), అక్రమ చేపల వేటపై పోరాడుతున్న WILD AID మెరీన్ సంస్థ (అమెరికా)లను ఈ ఎకో ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నాయి..