ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ పూర్తి.

తెలంగాణ రాష్ట్రంలోని 120 కళాశాలల్లోని 7,982 బీఫార్మసీ, ఫార్మా-డి, బీటెక్‌ బయోటెక్నాలజీ సీట్లన్నీ భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు.

ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు మొదటి విడతలో 7,982 సీట్లను విద్యార్థులకు కేటాయించినా 1,975 మంది విద్యార్థులు చేరలేదు. దాంతో చివరి విడతలో ఆ సీట్లను కేటాయించారు. చివరి విడత కౌన్సెలింగ్ డిసెంబ‌రు 5 తో ముగిసింది.

తొలి విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన 2,111 మంది కూడా మెరుగైన కళాశాలల కోసం చివరి విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో సీట్లు పొందినవారు డిసెంబ‌రు 9వ తేదీలోపు రుసుం చెల్లించి ఆయా కళాశాలల్లో చేరాలని అధికారులు సూచించారు.

Follow Us@