తాడ్వాయి ఏజెన్సీలో లక్ష రూపాయలు విలువ చేసే దుప్పట్ల పంపిణీ చేసిన ద్యుతి ఫౌండేషన్


హైద్రాబాద్ కు చెందిన ద్యుతి ఫౌండేషన్ వారు తాడ్వాయి మండలంలో పంబాపూర్, జలగలంచ గ్రామాలలో లక్ష రూపాయలు విలువ చేసే దుప్పట్లు పంచిపెట్టారు.

ద్యుతి చైర్మన్ అభిలాష్ మాట్లాడుతూ చలికాలంలో ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రక్షణ కోసం ఆదివాసీలకు దుప్పట్లను ఇస్తున్నామని తెలిపారు.
సమాజానికి తిరిగి చెల్లించు దృక్పథంతో తమ సేవలను అందివ్వడానికి తాడ్వాయిని ఎంచుకున్నామని అన్నారు. విద్య ఆరోగ్య రంగంలో తమ సేవలను విస్తరిస్తాము అని తెలిపారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేత
తాడ్వాయి కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సామాజిక బాధ్యతతో నిరుపేద ఆదివాసీలకు సేవలందించడం అభినందనీయమ అని అన్నారు.

ఈ కార్యక్రమములో సర్పంచ్ సుశీల, ఫౌండేషన్ ప్రతినిధులు హరీష్ కుమార్, సందీప్ గోరుగంటి, నర్సింహా, రౌతు వెన్నెల, ప్రదీప్, అశోక్ లు పాల్గొన్నారు.

Follow Us @