DUAL DEGREE : ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

హైదరాబాద్ (జనవరి – 23) : JNTU యూనివర్సిటీ… ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయెల్ డిగ్రీ కోర్సులను (Dual degree) 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో కళాశాలకు 60 సీట్లు కేటాయించింది. కనీసం 30% మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఈ మేరకు విధివిధానాలు జారీ చేసింది.

బీబీఏ (డేటా అనలైటిక్స్) కోర్సును ఆన్లైన్ లో చదివేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. తద్వారా నైపుణ్యాలు అలవడి విద్యార్థులకు మెరుగైన ప్యాకేజీలతో కొలువులు దక్కుతాయని చెబుతోంది.

ఇంజినీరింగ్ చదువుతున్న ద్వితీయ, తృతీయ, నాలుగో ఏడాది విద్యార్థులు బీబీఏ చేసేందుకు అర్హులవుతారు. ఏటా రూ. 60 వేల చొప్పున.. మూడేళ్లకు రూ.1.80 లక్షల ఫీజును నిర్దేశించారు. ప్రత్యేక ఫీజు కింద ఏటా రూ. 5,500, పరీక్ష ఫీజు రూ.1910(సెమిస్టరు రూ. 955) చెల్లించాల్సి ఉంటుంది.

◆ విధివిధానాలు :

  • కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా ఆరేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఈలోగా పూర్తి చేయకపోతే ప్రవేశం రద్దవుతుంది.
  • కోర్సు చేస్తే 138 క్రెడిట్స్ సాధించేందుకు వీలుంటుంది.
  • బీటెక్ లో సాధించే క్రెడిట్స్ కు ఇవి అదనం కావడంతో ఉద్యోగాల సాధనలో ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
  • కోర్సు బోధన శని, ఆదివారాల్లో ప్రత్యక్షంగా సాగనుండగా మిగతా రోజుల్లో ఆన్లైన్ లో ఉంటుంది.
  • విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్ లో చేసుకోవాలి.
    సమ్మర్ ఇంటర్న్షిప్ లు తప్పనిసరి.
  • *ఇంటర్నిషిప్ లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. లేకపోతే అనుత్తీర్ణులుగా గుర్తిస్తారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @