జేఎన్టీయూ లో డ్యూయల్ డిగ్రీలకు అనుమతి

హైదరాబాద్ (జూలై – 31) : ఏఐసీటీఈ, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం డ్యూయల్ డిగ్రీ విధానాన్ని (ఒకే సంవత్సరంలో రెండు డిగ్రీలు) జేఎన్టీయూ అందుబాటులోకి తీసుకొచ్చింది. బీటెక్ తో పాటు రెండో డిగ్రీగా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ (బీబీఏ) కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. బీబీఏ కోర్సుకు 40 శాతం ఆన్లైన్ లో, 60 శాతం ఆఫఫ్ లైన్ లో పాఠాలు బోధిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.

మెరిట్ స్టూడెంట్లు ఒకే సంవత్సరంలో రెండు డిగ్రీల పూర్తి చేసుకోవడానికి ఇదోక మంచి అవకాశమని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు.

సుల్తాన్ పూర్ లోని జేఎన్టీయూ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్ కొత్తగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ కోర్బులను తీసుకొచ్చినట్టు తెలిపారు.

Follow Us @