ఒకేసారి 2 డిగ్రీల విధానాన్ని అమలు చేయండి – UGC

  • వెంటనే నిబంధనల్లో మార్పులు చేసుకోండి
  • విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశం

న్యూడిల్లీ (అక్టోబర్ – 01) : విద్యార్థుల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్ స్టడీ విధానంలో ఒకే సమయంలో విద్యార్థులు రెండు డిగ్రీలు పూర్తి చేసేలా తమ నిబంధనల్లో సత్వరమే చట్టబద్ద మార్పులు చేసుకోవాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు శుక్రవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేఖ రాసింది.

ఈ పథకాన్ని వెంటనే అమలయ్యేలా చూడాలని అందులో పేర్కొంది. ఏక కాలంలో రెండు డిగ్రీల ప్రతిపాదనకు ఏప్రిల్ లో యూజీసీ ఆమోదం తెలిపింది. తర్వాత మార్గదర్శకాలనూ విడుదల చేసింది.