DSC 2023 : మహిళలకు సమాంతర రిజర్వేషన్లు – హైకోర్టు

హైదరాబాద్ (అక్టోబర్ -20) : డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 5,089 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. Dsc notification 2023 women reservation

వర్టికల్ విధానం లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి వాదనలు నవంబర్ 15న వింటామని తెలిపింది.

దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.