DSC NOTIFICATION : రెండో వారంలో నోటిఫికేషన్.!

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకుగాను సెప్టెంబరు రెండో వారంలో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)/ DSC NOTIFICATION జారీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

మొత్తం 5,089 సాధారణ ఉపాధ్యాయ పోస్టులు, మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఇటీవల జీఓలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

సెప్టెంబరు 15వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. ఆ పరీక్ష కంటే ముందే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. టెట్ ఫలితాలు సెప్టెంబరు 27వ తేదీన వెలువడనున్నాయి. అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును నిర్దేశించనున్నారు.

◆ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం

ఉపాధ్యాయ పదోన్నతుల తర్వాత కొత్తగా టీచర్ల నియామకాల సంఖ్య పెరగవచ్చని విద్యాశాఖ చెబుతున్నా.. ఈసారికి మాత్రం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఉద్యోగాలతో కలిపి మొత్తం 6,612 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఖాళీల సంఖ్య పెరిగితే మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం.