DSC, TET పై రేపు కేబినేట్ సబ్ కమీటి నిర్ణయం

హైదరాబాద్ (జూలై 6) : తెలంగాణ విద్యా శాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జూలై 7న జరగనున్నది. ఈ సమావేశంలో TET, DSC నిర్వహణ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈమంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశంలో వీరంతా పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం రెండో విడత సెకండ్ ఫేజ్ చేపట్టడం, ఫీజు రెగ్యులేటరీ (ఫీజుల.నియంత్రణ), టీచర్ల నియామక (టెట్, డీఎస్సీ నిర్వహణ) ప్రక్రియ తదితర అంశాలు ఉపసంఘం సమావేశ ఎజెండాలో ఉన్నాయి.