BIKKI NEWS (JAN. 11) :Dr. Srivani appointed as Additional Controller of Examiner in satavahana University. శాతవాహన విద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ కోడూరి శ్రీవాణిని విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి (యు.జి.)గా, అర్థశాస్త్ర విభాగపు అధిపతిగా నియమిస్తూ రిజిస్టార్ ప్రొఫెసర్. రవికుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Dr. Srivani appointed as Additional Controller of Examiner in satavahana University.
గతంలో శ్రీవాణి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా మహాదేవపూర్ లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలుగా మాచర్ల గుంటూరు జిల్లాలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొంతకాలం విధులు నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంతకుముందు అర్థశాస్త్రం హెచ్వోడిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా విశ్వవిద్యాలయ బాలికల వసతి గృహాల వార్డెన్ గా అదనపు పరీక్షల నియంత్రణ అధికారినిగా, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
తన పరిశోధక మార్గదర్శకత్వంలో ఇద్దరు విద్యార్థులు పిహెచ్డిలు పూర్తి చేశారు. ఇంతకు పూర్వం జాతీయ సేవా పథకంలో ఉత్తమ సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర పూర్వ బిసి మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించింది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి విద్యారంగంలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందుకు శ్రీవాణికి విద్యారంగంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా, పద్మ రత్న జీవిత సౌఫల్య పురస్కారానికి ఎంపికైంది.
ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారినిగా మరియు అర్థశాస్త్ర విభాగపు అధిపతిగా నియమించినందుకు ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారికి , రిజిస్టార్ ఫ్రొఫెసర్. రవికుమార్ జాస్తి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంకితభావంతో పారదర్శకంగా విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణకు, అర్థశాస్త్ర విభాగపు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్