DOST SPECIAL PHASE : డిగ్రీ అడ్మిషన్లకు మరో అవకాశం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 16) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం లో ఖాళీ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు (DOST SPECIAL PHASE ADMISSIONS 2023 ) జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.

★ DOST SPOT ADMISSIONS

అలాగే కళాశాల స్థాయిలో అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు (DOST SPOT ADMISSIONS 2023) జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి శనివారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

★ INTRA COLLEGE ADMISSIONS

ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారు అదే కళాశాలలో మరో కోర్సులోకి మారేందుకు ఇంట్రా కాలేజీ రెండో (INTRA COLLEGE ADMISSIONS 2023) విడతకు కూడా అనుమతి ఇచ్చారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వారికి ఈ నెల 21న సీట్లు కేటాయిస్తారు.

★ వెబ్సైట్ : https://dost.cgg.gov.in/welcome.do