హైదరాబాద్ (మే- 11) : 2023 – 24 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దోస్త్ (Degree Online Services Telangana) కన్వీనర్ ఆర్. లింబాద్రి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 16 నుంచి జూన్ 10 వరకు మొదటి దశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కింద ఉన్న డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కోసం దోస్త్ నోటిఫికేషన్ను జారీ చేశారు
మొత్తం మూడు దశలలో ప్రవేశాలను కల్పించుటకు దోస్త్ నోటిఫికేషన్ జారీ చేశారు.
★ మొదటి దశ ::
మొదటి దశ రిజిస్ట్రేషన్ గడువును మే16 నుండి జూన్ 10 వరకు ఇచ్చారు. మొదటి దశ వెబ్ ఆప్షన్ లను చేసుకోనుటకు మే 20నుండి జూన్ 11 వరకు గడువు విధించారు.
రిజిస్ట్రేషన్ ఫీజు 200/-
మొదటి దశ సీట్ అలాట్మెంట్ లను జూన్ 1 6వ తేదీన కేటాయించనున్నారు.
మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 1 6 నుంచి 25 వరకు చేసుకోవాలి.
★ రెండవ దశ ::
రెండవ దశ రిజిస్ట్రేషన్ గడువు జూన్ 1 6 నుంచి 26 వరకు నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ ఫీజు 400/-.
రెండవ దశలో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి జూన్ 1 6 నుంచి 27 వరకు గడువు విధించారు.
రెండవ దశ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను జూన్ 30వ తేదీన వెల్లడించనున్నారు.
రెండవ దశ లో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూలై – 01 నుంచి 05 వరకు అవకాశం ఇచ్చారు.
★ మూడవ దశ :
మూడవ దశ రిజిస్ట్రేషన్ కు గడువును జూలై – 01 నుంచి 05 వరకు కేటాయించారు.
రిజిస్ట్రేషన్ ఫీజు 400/-.
మూడవ దశ వెబ్ ఆప్షన్ కు గడువును జూలై – 01 నుంచి 06 వరకు కేటాయించారు.
మూడవ దశ సీట్ల ను జూలై 10వ తేదీన కేటాయిస్తారు.
మూడవ దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై – 10 నుంచి 14 వరకు కేటాయించారు
★ కళాశాలలో రిపోర్టింగ్ తేదీలు ::
మూడు దశల్లో సీట్లు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలో భౌతికంగా రిపోర్ట్ చేసే గడువును జూలై – 10 నుంచి 17 వరకు కేటాయించారు.
జూలై 17 నుండి మొదటి సంవత్సరం – మొదటి సెమిస్టర్ డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://dost.cgg.gov.in/