DOST లో సీట్లు పొందిన అభ్యర్థులు తర్వాత ఏం చేయాలి.?

  • మొదటి దశలో 1,12,683 మందికి సలహా సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 7 నుండి 22 వరకు రెండో దశ

హైదరాబాద్ (ఆగస్టు – 06) : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం 1,44,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,12,683 మంది సీట్లు పొందినట్లు లింబాద్రి తెలిపారు.

సీట్లు పొందిన అభ్యర్థులకు సూచనలు

  • సీట్లు పొందిన అభ్యర్థులు 500/- లేదా 1000/- చెల్లించి ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీట్లు తొలగించబడుతాయి.
  • ఇంకా మంచి కళాశాల లో సీటు పొందాలని అనుకుంటున్న అభ్యర్థులు రెండో దశ కౌన్సెలింగ్ లో స్లైడింగ్ ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ కచ్చితంగా మొదటి దశలో ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్థులు మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత సీటు వచ్చిన కళాశాలలో భౌతికంగా తగిన సర్టిఫికెట్ లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • రెండో దశ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ల గడువు ఆగస్టు – 7 న ప్రొరంభమై ఆగస్టు 22న ముగుస్తుంది.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in/welcome.do