దోస్త్ 3వ దశ షెడ్యూల్ విడుదల, కళాశాల మార్పుకు అవకాశం

దోస్త్ అడ్మిషన్ల గడువు రెండవ పేజ్ ఈ రోజుతో ముగిసింది. మూడవ ఫేజ్ షెడ్యూల్ ను దోస్త్ కన్వీనర్ మరియు ఉన్నత విద్య చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు

  • పేజ్ – 3 రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 27 తో ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనుంది. వెబ్ ఆప్షన్ల గడువు ఆగస్టు 27 ప్రారంభమై సెప్టెంబర్ 20 వరకు ఉంటుంది
  • స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ -15 న జరుగుతుంది.
  • మూడవ పేజ్ లో సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 24న కేటాయిస్తారు
  • ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి సెప్టెంబర్ 24 నుంచి 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు
  • కళాశాలలో రిపోర్టు చేయడానికి ఫేస్ – I, II, III లలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 24 నుండి 27 వరకు అవకాశం కలదు
  • కళాశాల మార్పుకోసం ఇంట్రా కాలేజ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 28, 29 తేదీలలో కలదు
  • ఇంట్రా కాలేజ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తేదీ సెప్టెంబర్ 30
  • ఒకటవ సెమిస్టర్ తరగతులు అక్టోబరు 1 నుండి ప్రారంభం కానున్నాయి.