DOST SPECIAL PHASE COUNSELLING : డిగ్రీ ‘ప్రత్యేక’ అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆగస్టు – 03) : తెలంగాణ డిగ్రీ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం మరొక అవకాశాన్ని విద్యార్థులకు “ప్రత్యేక కౌన్సిలింగ్” (DOST 2023 SPECIAL PHASE COUNSELLING) ద్వారా కల్పించారు.

ప్రత్యేక వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 7వ తారీఖున ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు ఆగస్టు 17వ తేదీన చేయనున్నారు.

ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ దరఖాస్తులను ఆగస్టు 2 నుండి 4 వరకు తీసుకోనున్నారు. ఆగస్టు 5వ తేదీన సీట్లు కేటాయించనున్నారు.

★ ప్రత్యేక వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

రిజిస్ట్రేషన్ :- ఆగస్టు 7 – 13
వెబ్ ఆఫ్షన్స్ :- ఆగస్టు 7 – 14
సర్టిఫికెట్ వెరిఫికేషన్ :- ఆగస్టు – 14
సీట్ల కేటాయింపు :- ఆగస్టు – 17
ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ :- ఆగస్టు – 17 – 21
కళాశాల రిపోర్టింగ్ :- ఆగస్టు – 18 – 21

◆ వెబ్సైట్ : https://dost.cgg.gov.in/welcome.do