DOST 2023 : త్వరలో డిగ్రీ అడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్ (మే – 10) : తెలంగాణ రాష్ట్రంలో 2023 – 24 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దోస్త్ (DOST – 2023 NOTIFICATION) నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో విడుదల కానున్నది.

ఏటా ఇంటర్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే దోస్త్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసే వారు. ఈసారి బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనుండటంతో అధికారులంతా వీటిపైనే ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల్లో సమాచేశమై, దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.