హైదరాబాద్ (జూన్ – 16) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST – 2023) ద్వారా మొదటి దశ సీట్ల కేటాయింపును ఈరోజు పూర్తి చేశారు.. ఈ మొదటి దశలో 73,220 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వీరిలో 45 శాతం మంది కామర్స్ గ్రూపును, 22 శాతం మంది సైన్స్ గ్రూపులను ఎంచుకున్నారు.
◆ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ :
మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి జూన్ 25 వరకు గడవు కలదని లింబాద్రి తెలిపారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కళాశాల ఫీజును చెల్లించవచ్చు
◆ రెండో దశ రిజిస్ట్రేషన్ ప్రారంభం :
ఈరోజు నుండి DOST 2024 రెండో దశ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 26 వరకు రిజిస్ట్రేషన్, జూన్ 27 వరకు
వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవడానికి అవకాశం కలదు. జూన్ 30న రెండో దశ సీట్ల కేటాయింపు జరగనుంది. రెండో దశలో రిజిస్ట్రేషన్ కోసం 400/- రూపాయల రుసుము చెల్లించాలి.
◆ వెబ్సైట్ : https://dost.cgg.gov.in/