DOST 2023 : డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల

హైదరాబాద్ (మే – 11): డిగ్రీ ప్రథమ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశాలకు DOST – 2023 షెడ్యూలును ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది.

మొదటి దశ అడ్మిషన్లు కోసం ఈనెల 16 నుంచి జూన్
10 వరకు దోస్త్ వెబ్సైట్ లో విద్యార్థులు రిజిస్ట్రేషన్.
చేసుకోవాలి. ఈనెల 20 నుంచి జూన్ 11 వరకు వెబ్
ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. జూన్ 16న తొలి విడత డిగ్రీ
సీట్ల కేటాయింపు చేపడతారు.

జూన్ 30న రెండో విడత, జులై 10న మూడో విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 17న తరగతులు ప్రారంభం
అవుతాయి.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in/allotSchedule.do