హైదరాబాద్ (జూలై – 22) : తెలంగాణలో డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఆన్లైన్ పద్ధతి ప్రక్రియ దోస్త్ షెడ్యూల్ లో స్వల్ప మార్కులు జరిగాయి. తెలంగాణలో భారీ వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు అంశాలకు గడువు పెంచారు.
మూడో విడతలు సీట్లు పొందిన వారు జులై 26వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం కల్పించారు.
అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జూలై 26వ తేదీ లోపు కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.
డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు జులై 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచ్ లోకి మారేందుకు జూలై 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్ ప్రక్రియ జరుగుతుందని.. వారికి ఆగస్టు 1 సీట్లు కేటాయిస్తామని తెలిపారు.